నీకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఎవరూ లేరా.. అని అడుగుతున్నాడు..!

మా అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి చేశాం. అల్లుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం కూడా మంచిదే. కానీ, అతను మంచివాడు కాదు. మా అమ్మాయిని అనుమానిస్తున్నాడు. ‘కాలేజీ రోజుల్లో నీకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఎవరూ లేరా? ఉంటే చెప్పు.. నేనేమీ అనుకోను’ అంటూ విపరీతంగా...

Published : 23 Feb 2023 19:58 IST

మా అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి చేశాం. అల్లుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం కూడా మంచిదే. కానీ, అతను మంచివాడు కాదు. మా అమ్మాయిని అనుమానిస్తున్నాడు. ‘కాలేజీ రోజుల్లో నీకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఎవరూ లేరా? ఉంటే చెప్పు.. నేనేమీ అనుకోను’ అంటూ విపరీతంగా వేధిస్తున్నాడు. అతనికి తన తల్లి, అక్కాచెల్లెళ్లు అంటే కూడా గౌరవం లేదు. వాళ్లతో కూడా చులకనగా మాట్లాడతాడని మా అమ్మాయి చెప్పింది. కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. కౌన్సెలింగ్‌ ద్వారా తప్పకుండా అతనిలో మార్పు తీసుకురావచ్చు. ఇలాంటివారిలో చాలామంది సైకాలజిస్టుల వద్దకు వెళ్లి తమ సమస్యను పరిష్కరించుకుంటున్నారు. కొంతమందిలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల వారిలో ఇలాంటి భావన ఏర్పడుతుంటుంది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చేసే పనులు, ఆలోచనల వల్ల వారిలో మహిళల పట్ల చులకన భావం కలిగేలా చేస్తుంటాయి. తద్వారా పలు విషయాలపై వారికంటూ ఒక ఆలోచనా విధానాన్ని రూపొందించుకుంటారు. దాంతో ‘మహిళలందరూ ఇలానే ఉంటారు. మగవారు ఇలానే ఉండాలి’ అనే అభిప్రాయానికి వస్తారు. కానీ, వారి అభిప్రాయానికి, అసలు నిజానికి మధ్య చాలా అంతరం ఉంటుంది. ఫలితంగా పలు విషయాల్లో వారు ఇంతకు ముందు రూపొందించుకున్న ఆలోచనా విధానం వారిని తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి వారిలో ఏ విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి ప్రవర్తనాపరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ మంచి మార్గం. దీనివల్ల చాలావరకు వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావచ్చు. కాబట్టి, మీ అల్లుడిని మంచి సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లండి. వారు పరీక్షించి తగిన సలహా ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్