Ranbir-Alia: అప్పుడే పిల్లల గురించి ఆలోచించాం..!

పెళ్లయ్యాక పిల్లలు పుడితే ఏ పేరు పెట్టాలి? వాళ్లను ఎలా పెంచాలి? ఏం చదివించాలి?.. ఇలాంటి విషయాల గురించి కొంతమంది పెళ్లికి ముందే ఆలోచిస్తుంటారు. తామూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన....

Published : 02 Jul 2022 16:29 IST

(Photos: Instagram)

పెళ్లయ్యాక పిల్లలు పుడితే ఏ పేరు పెట్టాలి? వాళ్లను ఎలా పెంచాలి? ఏం చదివించాలి?.. ఇలాంటి విషయాల గురించి కొంతమంది పెళ్లికి ముందే ఆలోచిస్తుంటారు. తామూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే తమకు పుట్టబోయే పిల్లల గురించి పెళ్లికి ముందే ఆలోచించామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆలియా, రణ్‌బీర్‌లు. మరి, తమ సంతానం గురించి ఈ క్యూట్‌ కపుల్‌ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

తమ ఐదేళ్ల ప్రేమాయణాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి పీటలెక్కించారు బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ కపుల్ ఆలియా-రణ్‌బీర్. తమ అన్యోన్యతతో ప్రేమ పాఠాలు నేర్పే ఈ లవ్లీ కపుల్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

అలా పంచుకుంది!

ఈ మధ్య చాలా జంటలు తమ ప్రెగ్నెన్సీని విభిన్న తరహాలో ప్రకటిస్తున్నారు. రణ్‌లియాలు కూడా ఇదే తరహాలో తమ ప్రెగ్నెన్సీ గురించి అందరితో పంచుకున్నారు. ఆస్పత్రిలో తాను అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకుంటోన్న ఫొటోను ఆలియా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మా బేబీ రాబోతోంది..!’ అంటూ దానికి క్యాప్షన్‌ జోడించింది. ఈ ఫొటోలో రణ్‌బీర్ కూడా ఉన్నాడు. ఇలా తమ ప్రెగ్నెన్సీ గురించి పంచుకోగానే.. అటు సెలబ్రిటీలు, ఇటు నెటిజన్ల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అప్పుడే పెళ్లి చేసుకుందామనుకున్నా!

ఈ క్రమంలో- పెళ్లికి ముందు చాలా జంటలు తమకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించినట్లే.. తానూ తన సంతానం గురించి ఆలోచించానంటూ ఓ సందర్భంలో పంచుకుంది ఆలియా. ‘చాలామంది నేను 30ల్లో పెళ్లి చేసుకుంటానేమో అనుకున్నారు. కానీ ఏదీ మన చేతుల్లో ఉండదు కదా! ఆ సమయమొచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది. పిల్లల విషయంలో ముందు నుంచే నాకో స్పష్టత ఉంది. అదేంటంటే.. పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నా ఇష్టసఖుడితో వివాహం, ఆ వెంటనే అమ్మను కాబోతుండడం.. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది?!’ అందీ బాలీవుడ్‌ బ్యూటీ.

ఈ రెండూ చాలు!

నచ్చిన వారితో జీవితాన్ని పంచుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి? ప్రస్తుతం తాను అదే సంతోషంలో తేలియాడుతున్నానంటున్నాడు రణ్‌బీర్‌. ఆలియాతో కలిసి ఏడడుగులు నడవడం తనకు దేవుడిచ్చిన వరమన్న ఈ హ్యాండ్‌సమ్‌.. పిల్లల పేరుతో ట్యాటూ వేయించుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.

‘ఈ ఏడాది నా జీవితంలో జరిగిన సంతోషకర పరిణామం ఏదైనా ఉందంటే అది ఆలియాతో పెళ్లి. తనతో జీవితం పప్పన్నంలా ఎంతో మధురంగా ఉంది. తండ్రిని కాబోతున్నానన్న ఆనందం దీన్ని రెట్టింపు చేసింది. ఇప్పటివరకు నా శరీరంపై ఎలాంటి ట్యాటూలు లేవు. కానీ త్వరలోనే మా పిల్లల పేరు మీద ట్యాటూ వేయించుకోవాలనుకుంటున్నా..’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడీ బాలీవుడ్‌ హీరో.

ఆలియా-రణ్‌బీర్‌లు తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించడంతో ఇరువురి కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. వీళ్లిద్దరిలాగే వీళ్లకు పుట్టబోయే సంతానం కూడా ఎంతో అందంగా, జీనియస్‌గా పుడతారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్