మా అబ్బాయికి పర్సనాలిటీ టెస్ట్ చేయించాలా?

మా బాబు వయసు 17 సంవత్సరాలు. కాలేజీకి వెళ్తున్నాడు. ఇంట్లో ఒకవిధంగా, బయట మరోవిధంగా ప్రవర్తిస్తుంటాడని అందరూ అంటున్నారు. ఒక్కసారి సైకాలజిస్ట్‌ను సంప్రదించమని కూడా సూచిస్తున్నారు. ఈ సమస్యకు పర్సనాలిటీ టెస్ట్‌ చేస్తారని కూడా విన్నాం. ఇది మా అబ్బాయికి చేయించడం వల్ల ఉపయోగం ఉంటుందా?

Published : 08 Apr 2024 12:20 IST

మా బాబు వయసు 17 సంవత్సరాలు. కాలేజీకి వెళ్తున్నాడు. ఇంట్లో ఒకవిధంగా, బయట మరోవిధంగా ప్రవర్తిస్తుంటాడని అందరూ అంటున్నారు. ఒక్కసారి సైకాలజిస్ట్‌ను సంప్రదించమని కూడా సూచిస్తున్నారు. ఈ సమస్యకు పర్సనాలిటీ టెస్ట్‌ చేస్తారని కూడా విన్నాం. ఇది మా అబ్బాయికి చేయించడం వల్ల ఉపయోగం ఉంటుందా? పర్సనాలిటీ టెస్ట్‌ అంటే ఏంటి? దయచేసి తెలియజేయగలరు. - ఓ సోదరి

జ. మీరు ఈ ప్రశ్న అడగడం ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా ముందుచూపుతో ఆలోచిస్తున్నారు. అలాగే మన దేశంలో ఇలాంటి అంశాలపై అవగాహన పెరుగుతుండడం సంతోషకరం. అయితే పర్సనాలిటీ టెస్ట్‌ చేయాలా? వద్దా? అనే విషయం సొంతంగా తీసుకొనేది కాదు. ఈ నిర్ణయాన్ని క్లినికల్‌ సైకాలజిస్ట్‌ మాత్రమే తీసుకుంటారు. ఎవరైతే టెస్టింగ్‌, సైకోమెట్రిక్‌ అసెస్‌మెంట్ చేస్తారో వారిని క్లినికల్‌ సైకాలజిస్ట్‌ అంటారు. ఒకవేళ మీరు సైకియాట్రిస్ట్‌ వద్దకు వెళ్లినా పర్సనాలిటీ టెస్ట్‌ వంటివి అవసరమైతే క్లినికల్‌ సైకాలజిస్ట్‌ని సంప్రదించమని సూచిస్తుంటారు.

పర్సనాలిటీ టెస్ట్‌ ద్వారా వ్యక్తికి సంబంధించి.. ప్రస్తుతం, గతంలో జరిగిన పూర్తి వివరాలను తెలుసుకుంటారు. ఈ టెస్ట్‌ సాధారణ ఇంటర్వ్యూలాగా ఉంటుంది. ఇందులో ఏదైనా సమస్యను గుర్తిస్తే తిరిగి దానిపై పూర్తి ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పేపర్‌, పెన్సిల్‌ టెస్ట్‌ చేస్తుంటారు. అంటే కొన్ని రకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చి.. వాటిపై వారి అభిప్రాయాలను పేపర్‌పై రాయమంటారు. మరికొన్ని సందర్భాల్లో ప్రొజెక్టివ్‌ టెస్ట్‌ చేస్తుంటారు. ఇందులో కొన్ని కార్డులు చూపిస్తారు. ఒక్కో కార్డుపై వారి అభిప్రాయాన్ని తెలియజేయమంటారు. ఈ టెస్టుల్లో వచ్చిన ఫలితాలను బట్టి అతనిలో ఎలాంటి వ్యక్తిత్వ సమస్యలు ఉన్నాయి? వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తుంటారు.
క్లినికల్‌ సైకాలజిస్‌్టకు ఏవైనా సందేహాలు ఉంటేనే పర్సనాలిటీ టెస్ట్‌ అనేది చేస్తుంటారు. ఒకవేళ అతని వివరాలు తెలుసుకున్న వెంటనే ఒక క్లారిటీ వచ్చిందంటే పర్సనాలిటీ టెస్ట్‌ అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో బ్రీఫ్ మూడ్‌ సర్వే, మూడ్‌ అసెస్‌మెంట్‌ వంటివి చేస్తుంటారు. అయితే మీ అబ్బాయి సమస్య అతని ప్రస్తుత పరిస్థితి, గతంలో జరిగిన సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో పర్సనాలిటీ టెస్ట్‌కు చాలా ప్రాధాన్యం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్