ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఈ ఇద్దరూ!

అవకాశం ఇస్తే చాలు... మగువలు తమని తాము నిరూపించుకోవడమే కాదు చరిత్రనూ లిఖించగలుగుతారు. ఇందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కి లోకోపైలట్లుగా వ్యవహరిస్తున్న ఐశ్వర్య ఎస్‌. మీనన్, సురేఖాయాదవ్‌లే ఉదాహరణ. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న వేళ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వీరిద్దరికీ  ఆహ్వానం లభించింది.

Published : 09 Jun 2024 13:46 IST

వకాశం ఇస్తే చాలు... మగువలు తమని తాము నిరూపించుకోవడమే కాదు చరిత్రనూ లిఖించగలుగుతారు. ఇందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కి లోకోపైలట్లుగా వ్యవహరిస్తున్న ఐశ్వర్య ఎస్‌. మీనన్, సురేఖాయాదవ్‌లే ఉదాహరణ. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న వేళ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వీరిద్దరికీ  ఆహ్వానం లభించింది. వీరిలో ఐశ్వర్య దక్షిణ చెన్నై డివిజన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌. ఆమె ప్రస్తుతం వందేభారత్‌ రైలుని నడుపుతున్నారు. కచ్చితత్వం, చురుకుదనంతో పాటు రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థపై లోతైన పరిజ్ఞానంతో అధికారుల మన్ననలెన్నో అందుకున్నారు.

వందేభారత్‌తో పాటు జనశతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడిపి రెండు లక్షలకు పైగా ఫుట్‌ప్లేట్‌ గంటలను పూర్తిచేసి రికార్డూ సాధించారు. ఈమెతో పాటు ఆసియాలోనే తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందిన సురేఖాయాదవ్‌ది మహారాష్ట్రలోని సతారా. 1988లో భారతదేశపు తొలి మహిళా రైలు డ్రైవర్‌గా చరిత్ర సృష్టించిన ఆమె తన కెరియర్‌లో ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందుకున్నారు. సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కి మొదటి మహిళా లోకో పైలట్‌ కూడా. ఈ ఘనతలే వీరిద్దరికీ ప్రత్యేక ఆహ్వానాన్ని అందించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్