పెళ్లైన కొత్తలో..

భిన్న సంస్కృతి, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇరువురు మూడు ముళ్లతో ఒక్కటవుతారు. ఆ నూతన దంపతుల మధ్య అనుబంధం  పెనవేసుకోవడానికి కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.

Updated : 08 Feb 2023 14:40 IST

భిన్న సంస్కృతి, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇరువురు మూడు ముళ్లతో ఒక్కటవుతారు. ఆ నూతన దంపతుల మధ్య అనుబంధం  పెనవేసుకోవడానికి కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.

కొత్త దంపతులకు జీవితంలో మొదటి రెండేళ్లు కీలకమైనవి. నూరేళ్లు కలిసి అడుగులేయాల్సిన వారిద్దరూ ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది. వివాహానికి ముందు పాటించే విధానాలు, జీవనశైలి వంటివి పెళ్లైన తర్వాత ఇరువురికీ సంబంధించినట్లుగా మార్చుకొని నడుచుకోవడం అలవరుచుకోవాలి. లేదంటే మొదట్లోనే అభిప్రాయభేదాలు తలెత్తగలవు. ప్రతి చిన్న అంశాన్ని చర్చించుకోవడం, ఎదుటివారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవడం మంచిది. వ్యక్తిగత విషయాలు ఎదుటివారితో పంచుకొని నిర్ణయాలు తీసుకుంటే అపార్థాలకు తావుండదు.

సమయం.. భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం మరొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. ఇరువురూ ఉద్యోగులై, బిజీగా ఉన్నాకూడా.. రోజూ కలిసి మాట్లాడుకోవాలి. లేదంటే భాగస్వామి తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన అవతలివారిలో మొదలవుతుంది. ఇది పెరిగి పెద్దదై దూరాన్ని పెంచుతుంది. వారానికొకసారి సరదాగా బయటకెళ్లి ఆహ్లాదంగా సమయాన్ని గడపాలి. ఎదుటివారి మనసును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారికి మాట్లాడే అవకాశాన్నివ్వాలి. భాగస్వామి మనసుకు నచ్చిన అంశాలేంటో ఆసక్తిగా కనుక్కోవాలి. అభిరుచులు, ఆశయాలను ఒకరికొకరు పంచుకోవాలి.

స్వేచ్ఛ.. ఇరువురూ ఎదుటివారికి భావస్వేచ్ఛనివ్వాలి. సందర్భంబట్టి తమ అభిప్రాయాన్ని చెప్పనివ్వాలి. వారి సంప్రదాయం, సంస్కృతి గురించి చెప్పేటప్పుడు, వాటిని పాటించేటప్పుడు కించపరచకుండా గౌరవించాలి. ఒకరిలో పొదుపు చేసే అలవాటుంటే, మరొకరిలో ఖర్చు పెట్టే తత్వం ఉండొచ్చు. ఇటువంటప్పుడు ఇరువురూ చర్చించుకొని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పుట్టబోయే పిల్లలు, సొంతిల్లు వంటివాటికి పొదుపు చేయడం పాటిస్తే ఇరువురికీ తృప్తిగా అనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్