Air India: ఎయిరిండియా అధికారిపై ప్రయాణికుడి దాడి..!

ఇటీవల కాలంలో కొంతమంది ప్రయాణికుల ప్రవర్తన విమాన సిబ్బందికి తోటి ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. తాజాగా ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా ఎయిర్‌ఇండియా అధికారి చెంపను పగలగొట్టాడు.

Updated : 16 Jul 2023 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానాల్లో పలువురి ప్రయాణికుల (passenger) విపరీత చేష్టలు ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ ప్రయాణికుడు ఏకంగా ఎయిర్‌ఇండియా అధికారి చెంపను పగలగొట్టాడు. ఈ ఘటన సిడ్నీ (Sydney) నుంచి దిల్లీ ( Delhi) వెళ్లుతున్న ఎయిరిండియా (Air India) AI301 విమానంలో చోటు చేసుకుంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..

బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఎయిరిండియా సీనియర్‌ అధికారి సీటు సరిగా లేకపోవడంతో తన సీటును ఎకానమీలోకి మార్చుకున్నారు. అతడి పక్కనున్న మరో ప్రయాణికుడు బిగ్గరగా మాట్లాడుతూ (loud voice) తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో అధికారి అతడిని మెల్లగా మాట్లాడాలని సూచించారు. అది నచ్చని ప్రయాణికుడు ఆగ్రహానికి గురై అధికారి చెంపను పగలగొట్టాడు. అంతేకాకుండా ఆయన తలను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడాడు.

అక్కడ కిలో టమాటా రూ.300

దీంతో ఐదుగురు సిబ్బంది ఆ ప్రయాణికుడి వద్దకు వచ్చి.. అలా చేయొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ.. అతడు వినిపించుకోలేదు. విమానం దిల్లీ చేరుకున్న అనంతరం ప్రయాణికుడిని భద్రతా ఏజెన్సీకి అప్పగించినట్లు ఎయిర్‌ ఇండియా అధికారి తెలిపారు. ‘‘విమానంలో ప్రయాణికులు ఎలా ఉండాలో సూచించినప్పటికీ అతడు అనుచితంగా ప్రవర్తించి సిబ్బందిలో ఒకరిని గాయపరిచాడు. తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. అతడ్ని భద్రతా ఏజెన్సీకి అప్పగించిన తరువాత లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఎయిర్‌ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)కు సమాచారం అందించారు.

ఇటీవల కాలంలో కొంతమంది ప్రయాణికుల ప్రవర్తన విమాన సిబ్బందికి, తోటి ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ఒక ప్రయాణికుడు విమానంలో బాంబు ఉందంటూ అందర్నీ బెదిరించిన ఘటన చూశాం. ఓ విమానంలో ప్రయాణికులు ఘర్షణకు పాల్పడి కిటికీ అద్దలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. మరో ప్రయాణికుడు విమానం ఎగిరే సమయానికి తలుపు తెరిచే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని