ukraine Crisis: తొందరగా ఉక్రెయిన్‌కు సాయం ఆమోదించండి..!

రష్యాకు వ్యతిరేకంగా సమష్టి పోరాటానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి రెండోప్రపంచ యుద్ధం నాటి

Published : 11 May 2022 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాకు వ్యతిరేకంగా సమష్టి పోరాటానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి రెండోప్రపంచ యుద్ధం నాటి ‘లెండ్‌ అండ్‌ లీజ్‌’ కార్యక్రమాన్ని మళ్లీ సచేతనం చేసింది. ఈ మేరకు బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సంతకాలు చేశారు.  దీంతో కీవ్‌, తూర్పు ఐరోపాదేశాలకు బలం లభించినట్లైందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన ఉక్రెయిన్‌ రష్యాతో పోరాడేందుకు 40 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీను  సిద్ధంచేసింది. ఇది బైడెన్‌ కోరిన 33 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ కంటే పెద్దది. 
‘‘ యుద్ధ రంగంలో ఉక్రెయిన్‌ విజయం సాధించడానికి ఈ ప్యాకేజీ చాలా కీలకమైంది. సైనిక సప్లై వ్యవస్థలో ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉండాలంటే కాంగ్రెస్‌ దీనిని ఆమెదించడం చాలా ముఖ్యం. ఇంకా పదిరోజులే గడువు ఉంది. కాంగ్రెస్‌ అనుమతి కోసం ఎదురుచూస్తే మా తదుపరి సాయం పంపడాన్ని ఆపలేము. కాంగ్రెస్‌ వీలైనంత త్వరగా దీనిని ఆమోదించాలి’’ అని జోబైడెన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

సోమవారం క్యాపిటల్‌ హిల్‌కు అమెరికా మంత్రులు లాయిడ్‌ ఆస్టిన్‌, ఆంటోనీ బ్లింకన్‌ ఓ లేఖను పంపారు. దీనిలో మే 19వ తేదీకంటే ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తేదీ నాటికి నిధులు పూర్తిగా అడుగంటిపోతాయని పేర్కొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ సాయం కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని