Britain: రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు 10,000 డ్రోన్లు: బ్రిటన్‌

Britain: ఈ ఆయుధ ప్యాకేజీలో 1,000 కమికేజ్‌ (వన్‌వే అటాక్‌) డ్రోన్లు ఉండనున్నాయి. ఇవి నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలవు.

Published : 08 Mar 2024 07:00 IST

లండన్‌: రష్యా (Russia)ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌ (Ukraine)కు 10,000 డ్రోన్లు అందిస్తామని బ్రిటన్‌ (Britain) తెలిపింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ కీవ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో డ్రోన్ల కోసం ఉక్రెయిన్‌కు 256 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీని బ్రిటన్‌ ప్రకటించింది. దానికి అదనంగా మరో 160 మిలియన్‌ డాలర్లను ఈ డ్రోన్ల కోసం కేటాయించారు. ఈ ఆయుధ ప్యాకేజీలో 1,000 కమికేజ్‌ (వన్‌వే అటాక్‌) డ్రోన్లు ఉండనున్నాయి. ఇవి నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలవు. యూకే అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్‌ బలగాలు నల్ల సముద్రంలో రష్యా నౌకాదళంపై సమర్థంగా దాడి చేస్తున్నట్లు షాప్స్‌ ఈ సందర్భంగా తెలిపారు. కొద్దిరోజులుగా రష్యా నౌకాదళంపై అనూహ్య దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సైతం నల్లసముద్రంలో పెట్రోలింగ్‌ చేస్తున్న రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్‌ సముద్ర డోన్లు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో అది తీవ్రంగా దెబ్బతింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని