Storm Isha: యూకేను వణికిస్తున్న ఇషా తుపాను..!

యూకేను ఇషా (Storm Isha) తుపాను వణికిస్తోంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చాలా చోట్ల గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 

Updated : 23 Jan 2024 09:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూకేను ఇషా తుపాను (Storm Isha) వణికిస్తోంది. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. స్కాట్లాండ్‌లో గంటకు 107 మైళ్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఉత్తర ఐర్లాండ్‌, ఉత్తర ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్‌ ప్రాంతాలు గత పదేళ్ల కాలంలో ఇంత తీవ్రమైన ఈదురు గాలులను చవిచూడలేదు. ఒక్క ఉత్తర ఐర్లాండ్లోనే దాదాపు 40 వేల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మొత్తం ఐర్లాండ్‌లో కలిపి 2.3 లక్షల ఇళ్లలో కరెంటు లేదు. పెనుగాలుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. డబ్లిన్‌ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. దాదాపు 29 విమనాలను రద్దు చేశారు. 

ఇక స్కాట్లాండ్‌లో ఎక్కడ చూసినా కూలిన వృక్షాలే దర్శనమిస్తున్నాయి. దీంతో చాలా రహదారులు మూసుకుపోయాయి. అన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేశారు.  స్కాట్లాండ్‌ వ్యాప్తంగా 50 వరద హెచ్చరికలు జారీ చేశారు. ఎడిన్‌బర్గ్‌, గ్లాస్గో విమానాశ్రయాల్లో సేవలను రద్దు చేశారు. చాలా విమానాలను ఫ్రాన్స్‌, జర్మనీకు మళ్లించారు. ది సెల్లాఫీల్డ్‌ న్యూక్లియర్‌ సైట్‌లో కార్యకలాపాలను నిలిపివేశారు. అక్కడ భద్రతాపరంగా ఎటువంటి సమస్య లేదని ప్రభుత్వం చెబుతోంది. 

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వీధుల్లో రామ భజనలు

యూకేలోని వేల్స్‌ ప్రాంతానికి వరద ముప్పు పొంచిఉందని అధికారులు హెచ్చరించారు. నేషనల్‌ రీసోర్స్‌ వేల్స్‌ ప్రతినిధి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ‘‘మా వెబ్‌సైట్‌లో అప్‌డేట్లు చూడాలని సూచించారు. నిన్న రాత్రి చాలా తుపాను తీవ్రంగా ఉంది. నష్టాన్ని అంచావేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. మరికొన్ని గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు