Gender discrimination in AI: ఏఐలోనూ లింగవివక్ష!

లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు.. కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

Updated : 01 Oct 2023 08:18 IST

దిల్లీ: లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు.. కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్‌ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘‘నాయకత్వం గురించి తొలుత వెలువడ్డ డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదు. వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే వారి ప్రస్తావనను ఏఐ చేసింది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్‌ పేర్కొన్నారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని