జెలెన్‌స్కీ ప్రసంగానికి ‘ఆస్కార్‌’ ససేమిరా!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేదికపై తమ దేశం ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితులను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆశలు వమ్మయ్యాయి.

Updated : 11 Mar 2023 05:59 IST

లాస్‌ఏంజెలెస్‌: ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేదికపై తమ దేశం ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితులను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆశలు వమ్మయ్యాయి. ఆ వేదికపై మాట్లాడేందుకు ఆయనకు ఆస్కార్‌ నిర్వాహకులు అనుమతివ్వలేదని అమెరికా మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. ఈసారి వేడుకల్లో జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుమతి ఇవ్వాలని అకాడమీ బృందానికి అభ్యర్థన రాగా.. అది తిరస్కరణకు గురైందని తెలిపింది. ఆయనకు ఈ అనుభవం ఎదురుకావడం వరుసగా ఇది రెండోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని