బంగ్లాలో భారత దౌత్యాధికారుల ప్రత్యేక భద్రతకు స్వస్తి

భారత్‌ సహా మరో మూడు దేశాల ఉన్నత దౌత్యాధికారులకు అదనపు భద్రతా ఎస్కార్టు సేవలను నిలిపేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎ.కె.అబ్దుల్‌ మోమిన్‌ మంగళవారం ప్రకటించారు.

Published : 17 May 2023 04:16 IST

అమెరికా, బ్రిటన్‌, సౌదీ అరేబియా సిబ్బందికి కూడా..

ఢాకా: భారత్‌ సహా మరో మూడు దేశాల ఉన్నత దౌత్యాధికారులకు అదనపు భద్రతా ఎస్కార్టు సేవలను నిలిపేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎ.కె.అబ్దుల్‌ మోమిన్‌ మంగళవారం ప్రకటించారు. భారత్‌, అమెరికా, బ్రిటన్‌, సౌదీ అరేబియా దేశాల దౌత్యాధికారులు నగరంలో ప్రయాణిస్తున్నప్పుడు బంగ్లా పోలీసులు వ్యాన్లలో వారిని అనుసరిస్తూ భద్రత కల్పిస్తుంటారు. 2016 జూలై 1న ఇస్లామిక్‌ ఉగ్రవాదుల దాడిలో ఒక భారతీయ యువతితోపాటు మొత్తం 20 మంది విదేశీయులు మరణించినప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేశంలో శాంతిభద్రతలు మెరుగుపడినందున ఇకపై తమ ప్రజలు చెల్లించిన పన్నులతో దౌత్యాధికారులకు అదనపు భద్రత కల్పించే పద్ధతికి స్వస్తి చెబుతున్నామని డాక్టర్‌ మోమిన్‌ వివరించారు. అయితే దౌత్యాధికారులకు సాధారణ బందోబస్తు కొనసాగుతుందని ఢాకా నగర పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని