హ్యూస్టన్‌ను ముంచెత్తిన వరదలు

ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది.

Published : 05 May 2024 04:52 IST

హ్యూస్టన్‌: ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. రహదారులన్నీ బురదనీళ్లతో నిండిపోయాయి. ఇళ్లు ఖాళీచేసి వెళ్లేందుకు పలువురు సిద్ధం కావాల్సి వస్తోంది. తమ జీవితకాలంలో ఎన్నడూ లేనంత వరదల్ని చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వరకు మరింతగా వానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిక జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని