రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్‌

రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్‌ బుధవారం బహిష్కరించింది.

Updated : 09 May 2024 06:15 IST

లండన్‌: రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్‌ బుధవారం బహిష్కరించింది. తమ దేశంలో రష్యా నిఘా కార్యకలాపాలను ఈ అధికారి పర్యవేక్షిస్తున్నారని బ్రిటన్‌ హోంశాఖ కార్యాలయం తెలిపింది. ఈ విషయంలో రష్యా రాయబారికి కూడా సమన్లు పంపి.. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘జాతీయ భద్రతకే మా తొలి ప్రాధాన్యత. మిత్రదేశాలను.. మా దేశ ప్రజలను రక్షించేందుకు మేం చేయాల్సిందంతా చేస్తాం’’ అని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని