ఇండియానా ప్రైమరీల్లో బైడెన్‌, ట్రంప్‌ విజయం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు.

Published : 09 May 2024 04:55 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. ట్రంప్‌నకు ఇక్కడ 58 మంది డెలిగేట్ల మద్దతు లభించింది. బైడెన్‌ 79 మంది డెలిగేట్లను గెలుచుకున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం విస్కాన్సిన్‌లోని రసీన్‌కు బైడెన్‌ చేరుకున్నారు. 330 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అక్కడ నిర్మించబోయే డేటా సెంటర్‌ గురించి ఆయన ప్రస్తావిస్తారు. నవంబరులో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం రూపొందించిన తాజా ప్రకటనల్ని విడుదల చేస్తారు. రసీన్‌లో గెలుపు ఏ అభ్యర్థికైనా కీలకం. గతంలో 33 మంది అధ్యక్షుల్లో ఐదుగురు మినహా అందరూ ఇక్కడ విజయం సాధించినవారే. మరోసారి ఎన్నిక కావాలని ఉవ్విళ్లూరుతున్న బైడెన్‌ ఈ నెలాఖరు నాటికి 200 పైగా కార్యాలయాలను తెరిచి, దాదాపు 500 మంది సిబ్బందిని నియమించుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని