kashmir: కశ్మీర్‌పై జర్మనీ వివాదాస్పద ప్రకటన ..!

కశ్మీర్‌పై జర్మనీ వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. దక్షిణాసియాలో ఇదే ఆమె తొలి పర్యటన.

Published : 08 Jun 2022 12:53 IST

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌పై జర్మనీ వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. దక్షిణాసియాలో ఇదే ఆమె తొలి పర్యటన. ఈ సందర్భంగా ఆమె పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీతో కలిసి కశ్మీర్‌పై వివాదాస్పద సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘కశ్మీర్‌లో మానవ హక్కులను కాపాడేందుకు ఐరాస కృషి చేయాలి. ఇరువైపుల నుంచి నిర్మాణాత్మక చర్యలు ఉంటేనే భారత్‌-పాక్‌ సంబంధాలు మెరుగుపడతాయి. జర్మనీ ఐరాస భద్రతా మండలిలో భాగస్వామి కాదు.. అందుకే ఐరాసలోని మిగిలిన విభాగాల్లో కశ్మీర్‌కు మద్దతు ఇస్తాం’’ అని పేర్కొన్నారు.

కొవిడ్‌ నిర్ధారణతో పర్యటన ముగింపు‌..!

జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్నాలీనా బేర్‌బాక్‌కు కోవిడ్‌ సోకడంతో పాక్‌ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగారు. ఆమె  పాక్‌ విదేశీవ్యవహారాల శాఖ మంత్రితో భేటీ అనంతరం కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో పర్యటన రద్దు చేసుకొని జర్మనీకి వెళ్లిపోయారు. భోజన సమయంలో వాసన, రుచి తెలియకపోవడాన్ని ఆమె గుర్తించారు. వెంటనే ఆమె సిబ్బంది యాంటీజెన్‌ పరీక్ష నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్‌తో పాటు టర్కీ, గ్రీస్‌లో కూడా పర్యాటించాల్సి ఉంది. కానీ, ఇవన్నీ రద్దయినట్లు జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని