Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. తోషాఖానా కేసులో శిక్ష నిలిపివేత

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది.

Updated : 29 Aug 2023 14:26 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసు (Toshakhana Case)లో ఆయనకు ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు (Islamabad High Court) నిలిపేసింది. తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు సోమవారమే తీర్పును రిజర్వ్‌ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్‌ ఫారూఖ్‌, జస్టిస్‌ తారీఖ్‌ మహ్మద్‌ జహంగిరిలతో కూడిన ధర్మాసనం నేడు దాన్ని ప్రకటించింది.

ఇమ్రాన్‌.. తోషాఖానా స్కామ్‌ అంటే?

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పు వెలువడిన వెంటనే అరెస్టయిన ఇమ్రాన్‌.. ప్రస్తుతం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేయగా.. ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని నిలిపేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని