Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేస్తాం..!

బెయిల్ గడువు ముగిసిన వెంటనే పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టయ్యే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనౌల్లాహ్ వ్యాఖ్యానించారు.

Published : 06 Jun 2022 20:46 IST

ఇస్లామాబాద్‌: బెయిల్ గడువు ముగిసిన వెంటనే పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టయ్యే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనౌల్లాహ్ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌పై అల్లర్లు, దేశద్రోహం, ప్రభుత్వంపై సాయుధ బలగాలతో దాడులు వంటి మొత్తం రెండు డజన్లకుపైగా కేసులున్నాయని ది న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఒకసారి బెయిల్ గడువు ముగిస్తే.. బనిగాలాలోని ఆయన నివాసం బయట ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను అరెస్టు చేస్తారని మంత్రి వెల్లడించారు. ‘నైతిక, ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా విస్మరించి, ప్రత్యర్థులను దేశద్రోహులుగా పిలిచే ఒక వ్యక్తి .. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీకి అధినేతగా ఎలా ఉంటారు..?’ అని రాణాను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ వెల్లడించింది. 

ఆ త్రయం కోట్ల సంపద దోచుకుంది..ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య, ఆమె స్నేహితురాలు ఫరా గోగి .. ఈ ముగ్గురు పీటీఐ హాయాంలో కోట్ల విలువైన సంపద కొల్లగొట్టారని పీఎంఎల్‌(ఎన్‌) పార్టీ ఆరోపించింది. ‘2019లో ఇది మొదలైంది. ఆమ్నెస్టీ పథకం కింద ఫరా భర్తకు 320 మిలియన్ల పాకిస్థానీ రూపీల ఉపశమనం కలిగించారు’ అంటూ ఆరోపించింది. దానికి సంబంధించి ఆడియో టేప్‌ను విడుదల చేసింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని