Kosovo parliament: కొసావో పార్లమెంట్‌లో ఎంపీల ఘర్షణ..!

వీధి రౌడీల్లా పార్లమెంట్‌ సభ్యులు తన్నుకొన్న ఘటన కొసావో పార్లమెంట్‌లో చోటు చేసుకొంది. 

Published : 14 Jul 2023 16:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాధ్యతగల చట్టసభ సభ్యులే వీధి రౌడీల్లా బాహాబాహీకి తలపడ్డారు. అడ్డం వచ్చిన మహిళా సభ్యురాలినీ పక్కకు నెట్టేశారు. ఈ ఘటన కొసావో పార్లమెంట్‌లో చోటు చేసుకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన ఈ ఘర్షణ వీడియో వైరల్‌గా మారింది.

కొసావో పార్లమెంట్‌లో గురువారం ప్రధాని అల్బిన్‌ కుర్టి.. దేశంలోని సెర్బ్‌ జాతీయులతో ఘర్షణలను తగ్గించేందుకు తీసుకొంటున్న చర్యలను సభకు వివరిస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యుడు మెర్గిమ్‌ లేచి కుర్టి వైపు దూసుకెళ్లి నీళ్లు చల్లారు. ఈ చర్యతో పార్లమెంట్‌ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడికి దిగారు. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఓ లీకైన ఆడియోపై చర్చ సందర్భంగా ఈ గొడవ జరిగింది. దీంతో పార్లమెంట్‌ను రెండు గంటలపాటు వాయిదావేశారు.

కొన్నాళ్లుగా జాతులపరమైన ఘర్షణలతో ఉత్తర కొసావాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిలో అంతర్జాతీయ శాంతి దళాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది సైనికుల్ని నాటో అక్కడికి తరలించింది. కొసావో ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటామని చెప్పింది. స్థానిక ఎన్నికలతో కొసావోలో గొడవలు మొదలయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని