Putin-Jinping: పదేళ్లలో 42 భేటీలు.. పుతిన్‌తో చైనా అధ్యక్షుడి షీజిన్‌పింగ్‌..!

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య రాజకీయ విశ్వాసం ఎంతో అవసరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin).. చైనా అధ్యక్షుడితో పేర్కొన్నారు.

Published : 18 Oct 2023 13:36 IST

బీజింగ్‌: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సమన్వయం, విశ్వాసం అవసరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) పేర్కొన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను కాపాడేందుకు సంయుక్త కృషికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో ఉన్న పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.

మళ్లీ పాత తప్పులు చేయొద్దు: నెతన్యాహు

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (BRI) కార్యక్రమం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఐ పనితీరును ఆయన కొనియాడారు. అనంతరం జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఆయన.. ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో సన్నిహిత విదేశీ విధాన సమన్వయం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దీన్ని కొనసాగిస్తున్నామన్న ఆయన.. వీటన్నింటిపై సుదీర్ఘ చర్చలు జరుపుతామన్నారు. షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. పుతిన్‌, తాను గడిచిన 10ఏళ్లలో 42 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలను ఏర్పరచడంతోపాటు వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులమయ్యామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని