జస్టిస్‌ కనగరాజ్‌ నియామక జీవో సస్పెన్షన్‌

ప్రధానాంశాలు

జస్టిస్‌ కనగరాజ్‌ నియామక జీవో సస్పెన్షన్‌

ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఏపీ పోలీసు ఫిర్యాదుల అథార్టీ ఛైర్మన్‌గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామక జీవో అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వరకే ఆ పదవిలో కొనసాగుతారని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా 78 ఏళ్ల వయసున్న జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయన నియామకంపై రాష్ట్ర హాంశాఖ ఈ ఏడాది జూన్‌ 20న జారీచేసిన జీవో 57 అమలును నిలిపివేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని