ఆ జట్టును పాక్‌ మళ్లీ ఓడించింది
close

తాజావార్తలు

ఆ జట్టును పాక్‌ మళ్లీ ఓడించింది
ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ విజేత వెస్టిండీస్‌ను వరుసగా రెండో టీ20 మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ ఓడించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ పాక్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్‌ ఖలీద్‌ లతీఫ్‌ (40: 36 బంతుల్లో 3×4, 1×6)తో పాటు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (46: 32 బంతుల్లో 5×4), షోయబ్‌ మాలిక్‌ (37: 28 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్‌ ఝళిపించడంతో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగలిగింది. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ జట్టు పాక్‌ బౌలర్ల ధాటికి 144/9కే పరిమితమైంది. టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైన విండీస్‌ జట్టులో స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (30: 17 బంతుల్లో 4×4, 1×6) ఎక్కువ స్కోరు చేయడం కొసమెరుపు. శుక్రవారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ గెలిచిన విషయం తెలిసిందే. సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌ మంగళవారం జరగనుంది.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.