S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?

దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి వేళ.. గతంలో అమెరికా వెళ్లిన కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. టీకా ధ్రువపత్రం గురించి ఆయన చెప్పిన విషయం నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే...

గత రెండున్నరేళ్లుగా ఈ ప్రపంచం కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతూనే ఉంది. వ్యాప్తి కట్టడి కోసం కఠిన ఆంక్షల అమలు ఒకవైపు.. టీకా పంపిణీ మరోవైపు సాగుతోంది. ఈ మధ్యలో 2021లో ఆంక్షలు సడలించిన సమయంలో జై శంకర్ అమెరికా వెళ్లారు. ఆయన కుమారుడు అక్కడే నివసిస్తున్నారు. వారిద్దరూ కలిసి కొద్దిసేపు బయటగడిపి.. సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే సిబ్బంది కొవిడ్ టీకా ధ్రువపత్రం చూపించాలని అడిగారు. ‘నేను కొవిన్ యాప్‌ ఓపెన్‌ చేసి.. ఫోన్‌లో ఉన్న నా టీకా ధ్రువపత్రం చూపించాను. మా అబ్బాయి తన వ్యాలెట్ తెరిచి, అందులో మడిచిపెట్టి ఉన్న కాగితం తీసి చూపించాడు. ఆ కాగితం చూసి.. వారు ఇంకా ఎక్కడో ఉన్నారని నా మనసులో అనుకున్నాను’ అని అంటూ మంత్రి సరదాగా తన అనుభవాన్ని వివరించారు. ఆయన మాటలు విన్నవారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. 2021లో జరిగిన ఈ సంఘటన వీడియోను ఇటీవల ఓ నెటిజన్ షేర్ చేశారు. 

కరోనా టీకా పంపిణీ మొదలుపెట్టిన సమయంలో కేంద్రం కొవిన్‌ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా టీకా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.. అలాగే టీకా ధ్రువీకరణ పత్రాన్నీ పొందవచ్చు. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 208 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని