బ్రేకింగ్

breaking
08 May 2024 | 22:17 IST

చెలరేగిన హెడ్‌, అభిషేక్‌.. హైదరాబాద్‌ అద్భుత విజయం

హైదరాబాద్‌: ఐపీఎల్‌-17లో భాగంగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (89*; 30 బంతుల్లో 8×4, 8×6), అభిషేక్‌ శర్మ(75*; 28 బంతుల్లో 8×4, 6×6) బౌండరీలతో విరుచుకుపడ్డారు. లఖ్‌నవూ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. దీంతో మరో 10.2 ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

మరిన్ని

తాజా వార్తలు