ఈ వారంలో 5 ఐపీఓలు.. - Five IPOs to hit markets this week
close

Updated : 15/03/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ వారంలో 5 ఐపీఓలు..

రూ.3,764 కోట్ల సమీకరణ లక్ష్యం

దిల్లీ: ఈ వారంలో 5 ఐపీఓలు మదుపర్ల ముందుకొస్తున్నాయి. వీటి ద్వారా కంపెనీలు సుమారు రూ.3,764 కోట్లు సమీకరించనున్నాయి. ఏ కంపెనీ ఎంత మొత్తం సమీకరించబోతోందో చూద్దాం..
* క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌: వాహనాలకు పవర్‌ట్రెయిన్, ఇతర ఉత్పత్తులు తయారు చేసే ఈ సంస్థ రూ.824 కోట్ల పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ నేడు మొదలై, బుధవారం ముగుస్తుంది. ఇష్యూకు ధరల శ్రేణిని రూ.1,488-1,490గా నిర్ణయించారు. గత శుక్రవారం, ఈ కంపెనీ యాంకర్‌ మదుపర్ల నుంచి రూ.247 కోట్లు సమీకరించింది.
లక్ష్మీ ఆర్గానిక్స్‌: రూ.600 కోట్ల ఐపీఓ ఇది. ఒక్కో షేరుకు రూ.129-130 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ ఇష్యూ నేటి నుంచి బుధవారం వరకు జరగనుంది. గత శుక్రవారం, ఈ కంపెనీ యాంకర్‌ మదుపర్ల నుంచి రూ.180 కోట్లు సమీకరించింది.
కల్యాణ్‌ జువెలర్స్‌: ఒక్కో షేరుకు రూ.86-87 ధరల శ్రేణితో కల్యాణ్‌ జువెలర్స్‌ ఐపీఓకి రాబోతోంది. రేపటి నుంచి గురువారం మధ్య ఇష్యూ ఉంటుంది. రూ.1,175 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తోంది.
సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: ఈ ఇష్యూ ఈనెల 17న మొదలై 19న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.303-305 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.582 కోట్ల నిధుల్ని సమీకరించబోతోంది.
నజారా టెక్నాలజీస్‌: ఈ గేమింగ్‌ సంస్థ రూ.583 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు రాబోతోంది. ఈ నెల 17-19 మధ్య ఇష్యూ ఉంటుంది. ఒక్కో షేరుకు రూ.1,100-1,101 ధరల శ్రేణిని నిర్ణయించారు.
ఈ 5 ఐపీఓలతో పాటు గత శుక్రవారం ఆరంభమైన అనుపమ్‌ రసాయన్‌ ఐపీఓ రేపటితో ముగియనుంది. రూ.700 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో, ఒక్కో షేరుకు రూ.553-555 ధరల శ్రేణిని నిర్ణయించారు.

ఇవీ చదవండి...

ఏసీ-రిఫ్రిజరేటర్‌ ధరలూ వేడెక్కుతాయ్‌!

దేశీయ చమురు ఉత్పత్తిలో 70 శాతం వాటా ఓఎన్‌జీసీదే


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని