GST Collections: ఐదు నెలల గరిష్ఠానికి జీఎస్టీ వసూళ్లు! - GST collection hits 5 month high in Sep
close

Updated : 01/10/2021 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GST Collections: ఐదు నెలల గరిష్ఠానికి జీఎస్టీ వసూళ్లు!

వరుసగా మూడోనెలా రూ.లక్ష కోట్లు దాటిన వైనం

దిల్లీ‌: జీఎస్‌టీ వసూళ్లు వరుసగా మూడోనెలా రూ.లక్ష కోట్లు అధిగమించాయి. సెప్టెంబరు నెలలో రూ.1.17 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఐదు నెలల్లో ఇదే గరిష్ఠం. 2020 సెప్టెంబరుతో పోలిస్తే ఇవి 23 శాతం అధికం. వరుసగా ఎనిమిది నెలల పాటు రూ.లక్ష కోట్లకు పైగా నమోదైన జీఎస్టీ వసూళ్లు.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లకు తగ్గిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబరు జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.20,578 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.26,767 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.60,911 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.29,555 కోట్లతో కలిపి), సెస్సులు రూ.8,754 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.623 కోట్లతో కలిపి)గా ఉన్నాయి.

జులై-సెప్టెంబరు త్రైమాసికంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.1.10 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఐదు శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనడానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వృద్ధితో పాటు జీఎస్టీ ఎగవేత నివారణకు తీసుకున్న చర్యల ఫలితమే వసూళ్ల పెరుగుదల అని పేర్కొన్నారు. పండుగ సీజన్ నేపథ్యంలో రానున్న కొన్ని నెలల్లో జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.



Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని