close

ప్రధానాంశాలు

యాప్‌తో చెప్పండి.. చల్లగా ఉండండి

పానసోనిక్‌ నుంచి ఐఓటీ ఏసీలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ) విపణిలో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరకు 10 శాతం వాటా సాధించడమే లక్ష్యమని పానసోనిక్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ గౌరవ్‌ సాహ్‌ తెలిపారు. దేశంలో ఏటా 70 లక్షల ఏసీలు అమ్ముడవుతుండగా, ప్రస్తుతం తమ వాటా 6 శాతంగా ఉందని గురువారం ఇక్కడ తెలిపారు. వచ్చే వేసవి కోసం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మిరాయ్‌ ప్లాట్‌ఫాం కింద ఇంటర్నెట్‌కు అనుసంధానించిన ఇన్వర్టర్‌ ఏసీలు 30 మోడళ్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏ సమయంలో ఎంత ఉష్ణోగ్రత కావాలన్నది యాప్‌లో నమోదు చేస్తే.. ఆ విధంగానే ఏసీ పనిచేస్తుందని తెలిపారు. ఈ సాంకేతికతను బెంగళూరులోని ఇండియా ఇన్నోవేషన్‌ కేంద్రంలో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ నూతన శ్రేణి ఏసీల వల్ల తమ వ్యాపారం 25-30 శాతం వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఏసీల ధరలు రూ.35,990 - 2,50,000 ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏటా 50వేల వరకు ఏసీలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈసారి జనవరి నుంచే ఏసీల విక్రయాలు జోరందుకున్నాయని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.