ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురి మృతి! - 6 dead in lack of oxygen in madhya pradeshs covid hospital
close
Updated : 18/04/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురి మృతి!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. షాదోల్‌ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ప్రాణవాయువు‌ కొరతతో ఆరుగురు రోగులు మృతిచెందినట్లు సమాచారం. ఆక్సిజన్‌ లేకనే వారు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. కరోనాతోనే వారు మృతిచెందారని యాజమాన్యం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 11,269 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు 4,491 మంది మరణించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని