‘వకీల్‌సాబ్’ ట్రైలర్‌ టైమ్‌ ఇదే! - Vakeel SaabTrailer releasing tomorrow at Clock face six
close
Published : 28/03/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్’ ట్రైలర్‌ టైమ్‌ ఇదే!

వన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా  నిర్మించారు. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాంతర  పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.  

ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన పవన్‌.. శనివారంతో ఆ పని పూర్తి చేశారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు. ఈనెల 29న సాయంత్రం 6గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని