15ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జోడీగా ఆ భామ? - after 15 years chiru trisha to pair up for lucifer
close
Published : 23/02/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15ఏళ్ల తర్వాత మెగాస్టార్‌కు జోడీగా ఆ భామ?

ఈసారైనా సవ్యంగా సాగేనా?

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓ స్టార్‌ హీరోయిన్‌ మెగాస్టార్‌ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు  తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌?

చిరంజీవి నటించిన ‘స్టాలిన్‌’లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు నటి త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్‌ పంచుకోలేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’లో మొదట త్రిషనే కథానాయికగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారు. కాగా, ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నయనతారను కథానాయికగా అనుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నయన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని.. దీంతో, ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష కూడా ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని