Top Ten News @ 1 PM - afternoon top ten news
close
Published : 18/05/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. Eatala: మా ప్రజల్ని ఎవరూ కొనలేరు

తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని తెరాస నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక నేతలను బ్లాక్‌ మెయిల్‌ చేసే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. హుజూరాబాద్‌ ప్రజల్ని ఎవరూ కొనలేరని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈటలా.. రాజీనామా చేయ్‌: గంగుల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ఈటల పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల మాట్లాడారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల.. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ నిధుల విడుదల

ఏపీలో మ‌త్స్య‌కారుల‌కు అండ‌గా ఉంటామ‌న్న మాట నిల‌బెట్టుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి ఆయ‌న‌ ఆన్‌లైన్ విధానంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం నిధుల‌ను విడుద‌ల చేశారు. వేట‌కు వెళ్లి ప్ర‌మాద‌వశాత్తు చ‌నిపోతే రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. ఏపీలోని 1,19,875 మంది మ‌త్స్య‌కార‌ కుటుంబాల‌ను ఈ ప‌థ‌కం ద్వారా ఆదుకుంటున్నామ‌న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Raghurama: ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ప్రారంభం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి ఏపీ సీఐడీ పోలీసులు తీసుకొచ్చారు. ఆర్మీ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షలను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. India Corona: వణికిస్తోన్న మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మృత్యుఘోష మాత్రం ఆగట్లేదు. 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయి మరణాలు సంభవించడం వైద్య వ్యవస్థకు సవాలుగా మారింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 18,69,223 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,63,533 మందికి పాజిటివ్‌గా తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Chattisgarh:పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురి మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న జ‌రిగిన ఈ ఘ‌ట‌నలో ముగ్గురు మృతి చెంద‌డంతో పాటు 15 మందికి పైగా గాయాల‌య్యాయి. సిలిగ‌ర్ వ‌ద్ద పోలీస్ క్యాంపు ఏర్పాటుకు స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్యాంపు ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ గిరిజ‌నులు ఆందోళ‌న‌కు దిగిన స‌మ‌యంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Vaccine:ఫైజర్‌, మోడెర్నా టీకాలు సురక్షితమే

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు. అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి పరీక్షించినట్లు పరిశోధనలో సభ్యుడైన నథానియల్‌ నెడ్‌ ల్యాండౌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. దృఢంగా మారుదాం..బలంగా ఎదుర్కొందాం

ఊబకాయులు కరోనా బారినపడితే ఎక్కువ ఆక్సిజన్‌ అవసరమవుతుందని మడాక్‌ చిల్డ్రన్‌ ఇన్‌స్టిట్యూట్, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనంలో గుర్తించారు. మహమ్మారిని తట్టుకొనేందుకు వ్యాయామానికి మించిన మార్గం లేదంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా అధ్యయనం. శారీరక శ్రమకు దూరమై, కుర్చీకే అంకితమైన వారితో పోల్చితే వ్యాయామం, ఏరోబిక్స్‌ చేసేవారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉన్నట్లు నిర్దారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. INDvsENG: కోహ్లీసేనకు ఊరట!

కోహ్లీసేనకు శుభవార్త! బీసీసీఐ మంత్రాంగం ఫలించింది. టీమ్‌ఇండియాకు కఠిన క్వారంటైన్ నుంచి బ్రిటిష్‌ ప్రభుత్వం సడలింపులు కల్పించింది. ప్రయాణ ఆంక్షలను రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. సొంత దేశం, ఐర్లాండ్‌ పౌరులు మినహా మరెవ్వరినీ రానివ్వడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. #Hamas గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇదీ..!

నమ్మకంగా ఊరించే ఉచ్చులు.. భారీ ఆయుధ నిల్వలు.. నిత్యం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు.. కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా మార్గాలు.. ఇవి గాజాలోని హమాస్‌ సంస్థ భూగర్భ సొరంగ నెట్‌వర్క్‌లు. తాజాగా హమాస్‌ వెన్నువిరవాలని నిశ్చయించుకొన్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టింది. దీంతో దాదాపు 160 విమానాల బృందాన్ని రంగంలోకి దింపి ఉత్తరగాజాలో దాదాపు 150 భూగర్భ సొరంగాలను ధ్వంసం చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని