మళ్లీ తెర మీదకు ‘సఖి’ హీరోయిన్‌..! - ajiths wife to comeback after 2 decades
close
Updated : 21/07/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ తెర మీదకు ‘సఖి’ హీరోయిన్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరవయ్యేళ్ల క్రితం డైరెక్టర్‌ మణిరత్నం మార్కు వేసిన రొమాంటిక్‌ డ్రామా ‘సఖి’. అందులో హీరో, హీరోయిన్‌, పాటలు, సంగీతం.. ఇలా ఏదైనా సినిమా ప్రేక్షకులు మర్చిపోగలరా..? అప్పట్లో ఈ చిత్రం ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలో మాధవన్‌, శాలిని జంటగా కనిపించి సందడి చేశారు. ఆ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న శాలిని అంతకుముందే తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ‘బ్రహ్మపుత్రుడు’, ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’ వంటి హిట్‌ చిత్రాల్లోనూ ఆమె కనిపించింది. అయితే.. ఆమె హీరో అజిత్‌ను పెళ్లాడిన తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గించింది. 2001లో చివరిసారిగా తెరపై కనిపించింది. అయితే.. ఆమె మళ్లీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోందట. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇదే హాట్‌ టాపిక్‌. అయితే.. శాలిని మాత్రం తన పునరాగమనంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంతో శాలిని మళ్లీ సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రత్యేక పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. జయం రవి, విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్‌కుమార్, ఐశ్వర్యలక్ష్మి కూడా తారాగణంలో భాగమని తెలుస్తోంది. మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా అలరించనుంది. 2022 వేసవిలో మొదటి భాగం విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని