నటుడిగా దర్శకేంద్రుడు
close
Updated : 31/07/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటుడిగా దర్శకేంద్రుడు

తాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇన్నాళ్లూ కెమెరా వెనక ఉంటూ ఎంతో మంది తారల్ని వెండితెరకు పరిచయం చేశారు. గుర్తుండిపోయే చిత్రాల్ని ప్రేక్షకులకి అందించారు. వాణిజ్యపరంగా తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కించి... దర్శకేంద్రుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన ఆయన తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. ‘పెళ్లిసంద‘డి’ చిత్రం కోసం! కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో, ఆయన శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా నటించారు. శ్రీలీల కథానాయిక. దీప్తి భట్నాగర్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. ఇందులో వశిష్ఠ అనే పాత్రలో కె.రాఘవేంద్రరావు కనిపిస్తారు. ఆ పాత్రకి సంబంధించిన లుక్‌ని,  ప్రోమో వీడియోని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సామాజిక మాధ్యమాల ద్వారా    విడుదల చేశారు.  ‘‘వందకిపైగా సినిమాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని కెమెరా ముందుకొస్తున్నారు’’ అంటూ ట్వీట్‌ చేశారు రాజమౌళి. నటుడిగా కెమెరా ముందుకు రావడాన్ని పురస్కరించుకుని ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ కె.రాఘవేంద్రరావుకి ఓ లేఖ రాశారు. ‘‘మీ సినిమా ప్రయాణంలో ఇదొక కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో... ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులూ ఉత్సాహం చూపుతార’’ని అందులో పేర్కొన్నారు పవన్‌కల్యాణ్‌. ‘పెళ్లిసంద‘డి’ చిత్రీకరణ పూర్తయింది. దర్శకులు క్రిష్‌, అనిల్‌రావిపూడి తదితర సినీ ప్రముఖులు రాఘవేంద్రరావుకు అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని