ఓజోన్‌తో ఎన్‌95 మాస్కులు శుభ్రం
close
Published : 11/07/2020 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓజోన్‌తో ఎన్‌95 మాస్కులు శుభ్రం

దిల్లీ ఐఐటీలో సరికొత్త పరికరం ఆవిష్కరణ

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బంది ఉపయోగించే ఎన్‌95 మాస్కులను వైరస్‌ రహితంగా చేయడానికి దిల్లీ ఐఐటీకి చెందిన ఓ స్టార్టప్‌ సంస్థ ‘చక్ర్‌ డికోవ్‌’ పేరుతో ఒక పరికరాన్ని రూపొంచింది. వంటింట్లో వాడే ఓవెన్‌లా ఉండే ఈ పరికరంలో ఒక ట్రేలో మాస్కులను ఉంచి తలుపు మూయగానే అవసరమైనంత ఓజోన్‌ వాయువు ఉత్పత్తై ఎన్‌95 మాస్కులను 99.9999% శుభ్రం చేస్తుంది. దీని పనితీరును పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పరీక్షించి ధ్రువీకరించింది. ఒకసారి లోపలి మాస్క్‌లన్నీ శుభ్రం అయిన వెంటనే ఓజోన్‌ దానంతట అదే పూర్తిగా తగ్గిపోయే ఏర్పాట్లు చేశారు. 90 నిమిషాల్లో ఒకేసారి 50 మాస్కులు శుభ్రంచేసేలా దీన్ని రూపొందించారు. ఓజోన్‌ వాయువు బయటికి లీక్‌ కాకుండా పక్కా ఏర్పాట్లు చేసినట్లు రూపకర్తలు పేర్కొన్నారు. అతినీల లోహిత కిరణాలకంటే ఈ విధానం ద్వారా మాస్కులు పూర్తిగా శుభ్రం అవుతాయని తెలిపారు అతినీలతోహిత కిరణాలు ప్రసరింపజేసినప్పుడు నీడ పడినచోట అవి సరిగా శుభ్రం కావని, కానీ ఓజోన్‌ వాయువు అన్ని మూలలకూ వెళ్లి వైరస్‌, బ్యాక్టీరియాను చంపేస్తుందని పేర్కొన్నారు. ఇలా శుభ్రం చేసిన ఎన్‌95 మాస్కులను పదిసార్లు వాడొచ్చని, వాటి నాణ్యతలో ఎలాంటి తేడా రాదని తెలిపారు. దిల్లీ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే ఈ యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ వి.రామ్‌గోపాల్‌రావు పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని