INDvsENG: తొలి సెషన్‌లో ఆడుకున్న జో రూట్‌, జానీ బెయిర్‌స్టో.. - telugu news indvseng joe root and jonny bairstow playing well on third day
close
Published : 14/08/2021 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: తొలి సెషన్‌లో ఆడుకున్న జో రూట్‌, జానీ బెయిర్‌స్టో..

ప్రమాదకరంగా మారుతున్న నాలుగో వికెట్‌ జోడీ..

లండన్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌(89), జానీ బెయిర్‌స్టో(51) దీటుగా ఆడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఇప్పటికే శతక భాగస్వామ్యం నిర్మించారు. దాంతో భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 216/3 స్కోర్‌తో పటిష్ఠస్థితిలో నిలిచింది. మరోవైపు భారత బౌలర్లు వీరిద్దరినీ ఔట్‌ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ మాత్రం అవకాశం ఇవ్వడంలేదు. శనివారం ఉదయం 119/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన రూట్‌, బెయిర్‌స్టో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. అదే సమయంలో వారిద్దరూ అర్ధ శతకాలు సాధించి భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక రెండో సెషన్‌లోనూ భారత బౌలర్లు వికెట్లు సాధించకపోతే ఇంగ్లాండ్‌ ఆధిక్యంలోకి కూడా వెళ్లేలా కనిపిస్తోంది. మరోవైపు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని