close

ప్రధానాంశాలు

Updated : 16/04/2021 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శరీరాన్ని రెండు భాగాలు చేసి.. బ్యాగులో కుక్కి

కుప్పం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహం

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: ఓ యువకుడిని చంపి శరీరాన్ని రెండు భాగాలుగా కోసి.. బ్యాగులో కుక్కి అటవీ ప్రాంతంలో పడేసిన ఉదంతం చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన నడుమూరు అటవీ ప్రాంతంలో వెళుతున్న స్థానికులకు గురువారం ఓ బ్యాగు కనిపించింది. అందులోని పాదాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. బ్యాగులో మృతదేహం నడుం కింది భాగం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా సగభాగం కోసం చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. కుప్పం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి దుస్తులను బట్టి కర్ణాటక ప్రాంతవాసిగా అనుమానిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేశారని భావిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన