ఆనందం.. అంతలోనే విషాదం
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

ఆనందం.. అంతలోనే విషాదం

విశాఖ తీరంలో లభ్యమైన బాలిక మృతదేహం

దీపిక (పాతచిత్రం)

సాంబమూర్తినగర్‌ (కాకినాడ), విశాఖపట్నం: సరదాగా ఆడుతుపాడుతూ చదువుకునే వయసు ఆ చిన్నారి దీపికది. రోజూ నవ్వుతూ బడికి వెళ్లే ఆమె దసరా సెలవులకు కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం విశాఖలోని బంధువుల ఇంటికి వెళ్లింది. పాఠశాలలు తెరిచే సమయానికి ఆమె లేదన్న చేదు నిజాన్ని ఆ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖపట్నంలోని ఉక్కు పరిశ్రమ సమీపంలోని అప్పికొండ సముద్ర తీరంలో సోమవారం గల్లంతైన దీపిక (15) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కాకినాడ జగన్నాథపురానికి చెందిన బాలిక గంగవరంలోని బంధువుల ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం విధితమే. ఆమె ఆచూకీ కోసం కోస్టుగార్డు సిబ్బంది హెలీకాప్టర్‌తో గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత తీరంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం కుటుంబీలకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని చూసిన కన్నతల్లి సత్య హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె తండ్రి వోలుగూరి ప్రదీప్‌ ఆటోడ్రైవర్‌. వీరికి దీపిక, మౌనిక ఇద్దరమ్మాయిలు. దీపిక స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో 10వ తరగతి తరగతి చదువుతోంది. చలాకీగా ఉంటూ చదువులో రాణించే ఆమె మరణాన్ని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోళీలపేటలో తీవ్ర విషాదం నెలకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని