రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ వీఆర్వో..
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ వీఆర్వో..

చిన్నశంకరంపేట, జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీఆర్వో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జోగిపేట ఎస్‌ఐ వెంకటేశం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. టేక్మాల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌ వీఆర్వోగా లక్ష్మయ్య (41) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పని నిమిత్తం జోగిపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అందోల్‌ మండలం చింతకుంట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సంగారెడ్డి ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ మేరకు చిన్నశంకరంపేట తహసీల్దారు రాజేశ్వర్‌రావు, డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్‌, ఖాజాపూర్‌ సర్పంచి నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు యాదగిరి సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని