రహదారికి వారే రక్షణ కవచం!
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

రహదారికి వారే రక్షణ కవచం!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఎడతెరిపిలేని వానలకు గోతుల పాలవుతున్న నగరంలోని ప్రధాన రహదారుల సంరక్షణకు రక్షక భటులే నడుం బిగించారు. పలు ప్రాంతాల్లో వాహనదారుల అగచాట్లను చూసి.. వ్యక్తిగత శ్రద్ధ చూపి పలుచోట్ల గోతులను పూడ్చడానికి సహకరిస్తున్నారు. నిజానికి దారులు తిన్నగా ఉంటే.. రాకపోకలు సవ్యంగా సాగుతాయి. అవి గోతులతో నిండిపోతే ఎదురయ్యే సంచార ఇబ్బందులు వర్ణనాతీతం. ఆ ఇక్కట్లను అధిగమించడానికి పోలీసులు చొరవ తీసుకున్నారు. మైసూరు రహదారిలో అత్యంత రద్దీ కూడలిగా పేరొందిన నాయండనహళ్లి వంతెన మార్గంలో గోతులను మంగళవారం పూర్తిగా పూడ్ఛి. మార్గాన్ని సుగమం చేశారు. చుట్టు పక్కల నిర్మాణ పనుల్లో నిమగ్నమైన గుత్తేదారుల సహకారంతో వారు ఈ పని కానిచ్చారు. గోతుల పూడ్చివేతకు కంకరతో కూడిన మిశ్రమం కోసం విన్నవించడంతో గుత్తేదారులు సానుకూలంగా స్పందించి పనులకు సహకరించారు. పోలీసుల ఆలోచనను వాహనదారులు మెచ్చుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని