ప్రాజెక్టు వరద గేట్ల మూసివేత
eenadu telugu news
Updated : 21/10/2021 06:30 IST

ప్రాజెక్టు వరద గేట్ల మూసివేత

నిండుకుండలా మారిన నిజాంసాగర్‌

నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో ప్రధాన వరద గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు. బుధవారం సాయంత్రానికి 6,300 క్యూసెక్కుల వరద రాగా జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 2400 క్యూసెక్కులను మంజీరలోకి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు(17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404 అడుగులు(17.773 టీఎంసీలు) ఉందని అధికారులు తెలిపారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని