విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని
logo
Published : 18/06/2021 03:51 IST

విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని

మంత్రి కన్నబాబు వెల్లడి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రావడం ఖాయమని, ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు చట్టం రూపు దాల్చిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం గవర్నర్‌ బంగళాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే న్యాయపరమైన చిక్కులను అధిగమించే చర్యలు చేపట్టామన్నారు. చట్టం ఎప్పుడు రూపుదాల్చిందో అప్పుడే పరిపాలన రాజధాని విశాఖకు రావడం ఖాయమైందని, సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని