మద్యం నియంత్రణకు చర్యలు
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

మద్యం నియంత్రణకు చర్యలు

మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి


సమావేశంలో మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, సెబ్‌ డీసీ బాబ్జీరావు, తదితరులు

మాధవధార, న్యూస్‌టుడే: దశలవారీగా మద్య నిషేధ అమలుకు ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రేట్లను పెంచి, మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామన్నారు. శనివారం విశాఖ నగరం మాధవధారలో ఉన్న సెబ్‌ డీసీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయిని నియంత్రించేందుకు సెబ్‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అక్రమంగా మద్యం, మత్తు పానీయాల విక్రయాలపై 14500 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) డీసీ ఎస్‌.వి.వి.ఎన్‌.బాబ్జీరావు, ఈఎస్‌ పి.రామచంద్రరావు, ఏఈస్‌ ఎస్‌.శ్రీనాధుడు, సీఐ కె.సురేష్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని