వరదప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ విహంగవీక్షణం

తాజా వార్తలు

Updated : 18/08/2020 17:37 IST

వరదప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ విహంగవీక్షణం

రాజమహేంద్రవరం: ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం సీఎం జగన్‌ పరిశీలించారు. వరద పోటెత్తిన ప్రాంతాలను విహంగ వీక్షణం (ఏరియల్‌ సర్వే) ద్వారా ఆయన తిలకించారు.ఆయా చోట్ల పంటలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో హెలికాప్టర్‌ నుంచి సీఎం గమనించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు సుచరిత, పేర్ని నాని ఉన్నారు. 

అంతకుముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని