Sangam dairy: కస్టడీ పొడిగించేది లేదు
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sangam dairy: కస్టడీ పొడిగించేది లేదు

అ.ని.శా కోర్టు స్పష్టం

విజయవాడ: సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రిమాండ్‌లో ఉన్న తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీని పొడిగించేది లేదని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ధూళిపాళ్ల వేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్డులో విచారణ జరిగింది. నరేంద్ర తరఫున ఆయన న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వాదనలు వినిపించారు. రేపటితో కస్టడీ ముగియనుందని.. కరోనా సోకి ధూళిపాళ్ల ఆస్పత్రిలో ఉన్నందున విచారణ పూర్తి కాలేదని ఏసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నరేంద్ర కస్టడీ మరో వారం పాటు పొడిగించాలని కోరారు. స్పందించిన న్యాయస్థానం.. నరేంద్ర కస్టడీ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏసీబీ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కొవిడ్‌ బారిన పడిన ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని