HYD: నగరంలో డ్రగ్స్‌ సమస్య లేనప్పటికీ అప్రమత్తత అవసరం: అంజనీకుమార్‌

తాజా వార్తలు

Updated : 24/10/2021 11:22 IST

HYD: నగరంలో డ్రగ్స్‌ సమస్య లేనప్పటికీ అప్రమత్తత అవసరం: అంజనీకుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసు శాఖ నడుం బిగించింది. యువతలో అవగాహన కల్పించడానికి చర్యలు చేపడుతోంది. మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే అనర్థాలపై కళాశాలలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్ధులతో కలిసి పోలీసులు అవగాహన నడక నిర్వహంచారు. నడకను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సమస్య అంతగా లేదని.. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, సుభాష్‌రెడ్డితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని