TS News: అధికారులపై దాడి ఆరోపణలతో అరెస్టు.. 18 మంది మహిళా రైతుల విడుదల

తాజా వార్తలు

Updated : 11/08/2021 15:02 IST

TS News: అధికారులపై దాడి ఆరోపణలతో అరెస్టు.. 18 మంది మహిళా రైతుల విడుదల

ఖమ్మం: పోడు భూముల కేసులో జైలు పాలైన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌కు చెందిన పోడు సాగుదారులు జిల్లా కారాగారం నుంచి విడుదలయ్యారు. వీరిలో 18 మంది మహిళా రైతులు ఉన్నారు. ముగ్గురు చంటి పిల్లల తల్లులు సైతం ఆరు రోజులు జైలు జీవితం గడిపి బయటకు రావడంతో జిల్లా జైలు వద్ద ఉద్విగ్న వాతావరణ ఏర్పడింది. మహిళలు చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జైలు నుంచి బయటికొచ్చిన తల్లులు వారి పిల్లలను అక్కున చేర్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. బాధితులకు స్వాగతం పలికేందుకు న్యూ డెమోక్రసీ నేతలు కారాగారం వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
జైలులో తమను పోలీసులు కొట్టారంటూ బాధితులు న్యూడెమొక్రసీ నేతల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. దీంతో జైలు అధికారుల తీరును నిరసిస్తూ బాధితులో కలిసి వారు అక్కడే బైఠాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ గంట సేపు అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. మహిళలను కొట్టినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జైలు సూపరింటెండెంట్‌ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నిందితులైన తల్లులతో పాటు నెలల వయసున్న శిశువులను జైలుకు పంపడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కొణిజర్ల మండలంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని భూమిలో ఎల్లన్ననగర్‌ వాసులు పంటలు సాగు చేశారు. వాటిని తొలగించేందుకు ఇటీవల అటవీ అధికారులు రావడంతో స్థానిక మహిళలు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో 21 మందిని పోలీసుల అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని