ప్రధానాంశాలు

Published : 31/05/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Poison: 5 వేల లీటర్ల విషాన్ని ఇవ్వండి

భారత్‌ను కోరిన ఆస్ట్రేలియా 
ఎలుకల దాడిని ఆపడానికే..

సిడ్నీ: చాలా దేశాలు కరోనాతో ఇబ్బందిపడుతుంటే ఆస్ట్రేలియా ఎలుకల దాడులతో బెంబేలెత్తిపోతుంది. ముఖ్యంగా న్యూసౌత్‌వేల్స్‌లో వేల, లక్షల సంఖ్యలో ఎలుకలు పంటలపై, గ్రామాలపై దాడి చేసి.. భారీగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఎలుకలతో ఏ కొత్త మహమ్మారి వస్తుందోనన్న భయంతో ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. దీంతో భారత్‌ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్‌ను దిగుమతి చేసుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఈ ఎలుకల మందును గతంలో ఆస్ట్రేలియా నిషేధించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలుకల దాడిని ఆపడానికి ఆ నిషేధిత మందే విరుగుడుగా భావిస్తోంది. అందుకే 5 వేల లీటర్ల బ్రొమాడియోలోన్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవాలని న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net