close

తాజా వార్తలు

Updated : 26/03/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుంటూరులో మరో 3 అనుమానిత కేసులు

గుంటూరు: గుంటూరు జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో ఐడీ ఆస్పత్రిలో చేరారు. ముగ్గురు వ్యక్తులు జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని బుధవారం సాయంత్రం విజయవాడలోని కొవిడ్‌-19 ప్రత్యేక విభాగానికి తరలించారు. ఇకపై కరోనా పాజిటివ్‌ కేసులకు విజయవాడలోనే చికిత్స అందిస్తారని వైద్యులు తెలిపారు.

నాలుగురోజుల క్రితం కరోనా అనుమానిత లక్షణాలతో ఐడీ ఆస్పత్రిలో చేరిన 9 మందికి, జీజీహెచ్‌కు వచ్చిన మరో ఐదుగురికి కరోనా నెగటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఆరోగ్యం కుదుటపడిన ఆరు మందిని డిశ్చార్జ్‌ చేయగా.. మిగతా వారిని ఇవాళ సాయంత్రంలోగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, వారిని కొన్ని రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 25 కరోనా అనుమానిత కేసులు రాగా వారిలో 19 మందికి నెగటివ్‌.. ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. మరో ఐదుగురి నివేదికలు రావాల్సి ఉందని.. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చిన 2,431 మందిని గృహ నిర్బంధంలో ఉంచింది. కరోనా అనుమానిత కేసులు పెరిగితే ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 242 ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో 374 ఐసోలేషన్‌ పడకలు సిద్ధంగా ఉంచారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన