close

తాజా వార్తలు

దిల్లీ పోలీసులు సమర్థులే, కానీ..: కేజ్రీవాల్‌

దిల్లీ: శాంతి భద్రతలను కాపాడడంలో దిల్లీ పోలీసులు సమర్థులే కానీ, ఏవిధంగా వ్యవహరించాలన్న దానిపై వారికొచ్చిన ఆదేశాలతోనే అసలు సమస్య అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఇటీవల జహర్‌లాల్‌ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామిక్‌ వర్సిటీల్లో జరిగిన ఘటనలనుద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. వర్సిటీల్లో జరిగిన హింసను అడ్డుకోవడంలో దిల్లీ పోలీసుల వైఫల్యం లేదన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడి పోలీసులు నడుచుకుంటున్నారని, వారు చేసేదేమీ లేదన్నారు.

జేఎన్‌యూలో గత ఆదివారం ముసుగులు ధరించిన కొందరు దుండగులు రాడ్లు, కర్రలతో వర్సిటీలో విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే గత నెల సీఏఏకి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసుల తీరును పలువురు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులకు వచ్చే ఆదేశాల అనుసారం వారి చర్యలు ఉంటాయని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని తప్పుబట్టారు. శాంతి భద్రతల అంశం కేంద్రం చేతిలో ఉండడం ఇక్కడ గమనార్హం. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ పాలనకు, భాజపా నేతృత్వంలో ఉన్న దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాలనకు మధ్య ఉన్న భేదాన్ని వివరించారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికి స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. వాటి రూపురేఖలు మార్చి చూపించామని, అందుకు కావాల్సిందల్లా రాజకీయ సంకల్ప బలమేనని కేజ్రీవాల్‌ అన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.