close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. ‘కోర్టుకు డుమ్మా కొట్టేందుకే జగన్‌ పర్యటనలు’

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసులను పరిష్కరించుకునేందుకే జగన్‌ దిల్లీ వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అనుమతివ్వలేదని  ఆరోపించారు. విజయవాడలో యనమల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఇది రెండో పరాభవమని ఎద్దేవా చేశారు. దిల్లీ ఎప్పుడు వెళ్లినా తన సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరీ మినహాయింపుల గురించే అడుగుతున్నారని విమర్శించారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని యనమల ఆగ్రహాం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయ్‌: భట్టి

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్టు షాపులు తొలగించాలని కోరుతూ చేస్తూ గవర్నర్‌ తమిళిసై కి కాంగ్రెస్‌ నేతలు వినతిపత్రం సమర్పించారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు, మహిళలపై దాడులకు నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ విధానాలు నచ్చే వైకాపాలోకి: మస్తాన్‌రావు

తెదేపా సీనియర్‌ నేత బీద మస్తాన్‌రావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. పార్టీ కండువా కప్పి బీద మస్తాన్‌ను సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపాలో చేరిన మస్తాన్‌రావును ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ అభినందించారు. పార్టీలో చేరిన అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ విధానాలు నచ్చే వైకాపాలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేసే దిశగా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. న్యాయం ప్రతీకారంగా మారకూడదు: సీజేఐ

దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమమూర్తి జస్టిస్‌ బొబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తక్షణ న్యాయం అనేది సాధ్యపడదు. ఒకవేళ అది ప్రతీకారంగా మారితే న్యాయం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది’ అని అన్నారు. తన మాటల్లో ఎక్కడా హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. రాజస్థాన్‌ హైకోర్టు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘మహిళలకు చోటు లేని రాష్ట్రంగా యూపీ’

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లఖ్‌నవూ పర్యటనలో ఉన్న ఆమె.. బాధితురాలి మృతి వార్త తెలియగానే హుటాహుటిన ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. గత ఏడాది కాలంగా బాధితురాలి కుటుంబం వేధింపులు ఎదుర్కొంటోందని, నిందితులకు భాజపా నేతల అండదండలు ఉన్నాయని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ‘రాష్ట్రంలో నేరస్థులకు చోటు లేదని సీఎం చెబుతున్నారు. కానీ ఇక్కడ మహిళలకే చోటు లేకుండా పోతోంది’ అని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు: స్మృతి ఇరానీ

చిన్నారులపై లైంగికదాడుల నివారణకోసం చేసిన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణకు 1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇందుకోసం రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు శుక్రవారం ఆమె లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో కేంద్రం రూ.474 కోట్లు కేంద్రం సమకూరుస్తుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆర్మీ అధికారులుగా నటించి..రైఫిళ్లు ఎత్తుకెళ్లారు

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్మీ అధికారులుగా నటించి రైఫిళ్లను ఎత్తుకెళ్లిన ఘటన  మధ్యప్రదేశ్‌లోని పాచ్మారీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్మీ ఎడ్యూకేషన్‌ సెంటర్‌కు వచ్చారు. తమని తాము ఆర్మీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు.  సిబ్బందిని మాటల్లో పెట్టి ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్స్‌, 20 లైవ్‌ కాట్రిడ్జ్‌లను విడదీసి, దొంగిలించారు. సిబ్బంది రైఫిళ్లు దొంగతనానికి గురైయ్యాయని గుర్తించే లోపే దుండగులు ట్యాక్సీలో పారిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశంలో హింసకు రాహుల్‌ చెప్పిన కారణం..!

దేశంలో పెరిగిపోతున్న హింసకు భాజపా ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయన్నారు. తన నియోజకవర్గం వయనాడ్‌ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య భాజపా విద్వేషాలను రెచ్చగొడుతోందంటూ రాహుల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని.. కొంతమంది వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎయిర్‌టెల్‌ మొబైల్‌యాప్‌లో భద్రతా లోపం

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్‌ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. అయితే సరైన సమయంలో దాన్ని గుర్తించి సరిచేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్‌ డేటా లీక్ ముప్పు తప్పినట్టు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ యాప్‌లోని అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది. ఈ లోపం ద్వారా హ్యాకర్లు కేవలం యూజర్ల ఫోన్‌ నంబర్ల ద్వారానే వారి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విజయనగరం: భక్తిశ్రద్ధలతో భగవద్గీత జయంతి ఉత్సవం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.